చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా పాదయాత్ర

బాన్సువాడ: టీడీపీ అధినేత చంద్రబాడు పాదయాత్రకు మద్దతుగా బాన్సువాడ టీడీపీ నాయకులు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని సుమారు 200మంది కార్యకర్తలు బాన్సువాడ పట్టణం నుంచి బీర్కూర్‌ మండలంలోని నెమ్లీ సాయిబాబు ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.