చంద్రబాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు బయలుదేరిన తెదేపా నేతలు
కాగజ్‌నగర్, జనంసాక్షి: విశాఖలో శనివారం నిర్వహించనున్న చంద్రబాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు సిర్పూర్ నియోజకవర్గంలోని తెదేపా నాయకులు కార్యకర్తలు ఈ రోజు ప్రత్యేక రైల్లో బయలుదేరారు. బయలుదేరిన వారిలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుచ్చిలింగం, జిల్లా ఉపాధ్యక్షుడు రావి శ్రీనివాస్‌తోపాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు.