చంద్రబాబు పిటీ వారెంట్‌పై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్‌పై విచారణ.విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్‌ 5కు వాయిదా.ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ భూ దోపిడీకి పాల్పడిన కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు.ఇందులో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణతోపాటు పలువురిపై కేసు నమోదు.ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌.

నోటీసులు అందని వారికి మీరే అందజేయండి

  • చంద్రబాబు ‘స్కిల్‌’ కేసులో ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు హైకోర్టు వెసులుబాటు
  • విచారణ డిసెంబర్‌ 13కి వాయిదా
  • స్కిల్‌ స్కాం తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పిటిషన్‌
  • నోటీసులు అందని వారికి వాటిని ఆయనే అందజేయవచ్చని హైకోర్టు వెసులుబాటు
  • నోటీసులు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలనుకుంటే దాఖలు చేయవచ్చు
  • న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు
  • చంద్రబాబు హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో అనేక క్లిష్టమైన అంశాలు
  • సీబీఐ దర్యాప్తు చేయడమే సబబుగా ఉంటుందంటూ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పిటిషన్‌
  • సరైన చిరునామాలు లేకపోవడం వల్ల పలువురికి నోటీసులు అందలేదని తెలిసిన ధర్మాసనం