చంద్రుడిని ముద్దాడిన భారత కీర్తి పతాక..
` మువ్వన్నెల ఒడిలో ఒదిగిపోయిన నెలవంక..
` జాబిల్లి దక్షిణధృవంపై విజయవంతంగా కాలు మోపిన విక్రమ్
` ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫ్ట్ ల్యాండిరగ్
` చంద్రయాన్`3 మిషన్ గ్రాండ్ సక్సెస్
` ఇస్రో శాస్‌త్రవేత్తల ఆనందోత్సాహాలు
` ప్రయోగ విజయంపై ప్రధాని భావోద్వేగం
` నేనూ సగటు భారతీయుడిలా ఎదురుచూశా
` ఈ విజయంతో మరిన్నిప్రయోగాలకు పునాది
` ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోడీ అభినందనలు
` ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు
న్యూఢల్లీి(జనంసాక్షి): చంద్రుడి దక్షిణధృవాన్ని ప్రజ్ఞాన్ ముద్దాడిరది. 41 రోజుల ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ విజయం సాధించింది. దీంతో అమెరికా,రష్యా, చైనా దేశాల సరసన సగర్వంగా నిలిచింది. చంద్రయాన్ ద్వారా భారత్ మరో అంతరిక్ష విజయాన్ని అందుకుంది.. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్`3 విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాప్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది మంది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. దేశం యావత్తూ సంబరాల్లో మునిగి పోయింది. చంద్రయాన్ `3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు. మరోవైపు భారత్ చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్`3 పట్ల ప్రపంచ దేశాలు కూడా చాలా ఆసక్తిని చూపాయి. రష్యా చేపట్టిన మూన్ మిషన్ లూనా 25 రెండు రోజుల కిందట విఫలమైంది. ఆ దేశ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై కూలిపోయింది. ఈ తరుణంలో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి స్టాఫ్ ల్యాండిరగ్ కావడంపట్ల పలు దేశాలు ఆశ్చర్యపోయాయి. చంద్రయాన్ `3 సక్సెస్ పట్ల భారత్‌కు ప్రధానంగా ఇస్రోకు అభినందనలు తెలిపాయి. కాగా, ఇప్పటి వరకు చంద్రుడిపై దిగిన అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ ఈ ఘనత దక్కించుకున్నది. అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించింది. స్పేస్ క్రాప్ట్ చంద్రుడి నేలపైన సాప్ట్ ల్యాండిరగ్ విజయవంతం కావడంతో 40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరపడి పోయాయి. సాప్ట్ ల్యాండిరగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాప్ట్ ల్యాండిరగ్ పక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో సౌత్ పోల్ ను తాకిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది. సుమారు చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలో విూటర్ల ఎత్తులో ల్యాండర్ ఉండగా రఫ్ బ్రేకింగ్ ఫేస్ మొదలు అయింది. ఆ ఫేస్ సజావుగానే సాగినట్లుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో హారిజాంటల్ వెలాసిటీ 1200 విూటర్స్ పర్ సెకండ్ గా ల్యాండర్ వేగం ఉంది. ఒక్కసారి ఆటోమేటిక్ ల్యాండిరగ్ సిస్టమ్ (ఏఎల్‌ఎస్) యాక్టివేట్ అయిన అనంతరం గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎలాంటి కమాండ్స్ ఇవ్వబోరని లైవ్ స్టీమ్రింగ్ కామెంటరీలో చెప్పారు. చంద్రుడి ఉపరితలం నుంచి 28 కిలో విూటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్ వర్టికల్ వెలాసిటీ 31 విూటర్స్ పర్ సెకండ్, హారిజాంటల్ వెలాసిటీ 1058 విూటర్స్ పర్ సెకండ్ గా ఉంది. సాప్ట్ ల్యాండిరగ్ పక్రియ మొదలైన సరిగ్గా 8 నిమిషాల తర్వాత 21 కిలో విూటర్ల ఎత్తులో ల్యాండర్ ఉంది. అప్పుడు హారిజాంటల్ వెలాసిటీ 745 విూటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 67 విూటర్స్ పర్ సెకండ్ వెలాసిటీలో ఉంది. ఈ 8 నిమిషాల్లో 700 కిలో విూటర్లకు పైగా దూరం ల్యాండర్ ప్రయాణించింది. రఫ్ బ్రేకింగ్ ఫేస్ తర్వాత స్టాండ్ బై స్టేజ్ లేదా ఆల్టిట్యూడ్ హోల్డ్ ఫేస్ మొదలు అయింది. తర్వాత పైన్ బ్రేకింగ్ ఫేస్ మొదలు అయింది. ఇది మూడు నిమిషాలపాటు జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఎలాంటి కమాండ్స్ గ్రౌండ్ స్టేషన్ నుంచి ఇవ్వలేదు. ఈ సమయంలో హారిజాంటల్ వెలాసిటీ 120 విూటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 28 విూటర్స్ పర్ సెకండ్ గా ఉంది. సరిగ్గా ఈ టైంలో ఉపరితం నుంచి ఎత్తు 1.2 కిలో విూటర్లుగా ఉంది. ఆ తర్వాత ల్యాండర్ ఉపరితలానికి లంబకోణం చేస్తూ తిరిగింది. మెల్లగా సెన్సార్ల సాయంతో హారిజాంటల్ వెలాసిటీ, వర్టికల్ వెలాసిటీని మరింత తగ్గించుకొని చంద్రుడి ఉపరితలం వైపు కదులుతూ ఉంది. చంద్రుడి పై దిగే ముందు హారిజాంటల్ వెలాసిటీ 0.4 విూటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 2 విూటర్స్ పర్ సెకండ్ గా ఉండి చివరికి ఉపరితలంపై క్షేమంగా దిగింది. దీంతో శాస్త్రవేత్తలు ఆనందంగా లేచి అభినందనలు పంచుకున్నారు. ప్రధాని మోడీ సైతం దీనిని ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం వారికి అభినందనలు తెలిపారు.
చంద్రయాన్`3 విజయంపై ప్రధాని భావోద్వేగం
చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలను కృషిని కొనియాడారు. దేశ కీర్తి పతాకను ఇస్రో శాస్త్రవేత్తలు గగన వీధుల్లో ఎగరేశారని అన్నారు. ఇది మరిన్న ప్రయోగాలకు స్ఫూర్తి కానుందని అన్నారు. దీంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని మోదీ అన్నారు. చంద్రయాన్ సూపర్ సక్సెస్ మరీ కీలకమైన మైలురాయిగా పేర్కొన్న ప్రధాని తన జీవితం ధన్యమైందని అన్నారు. జొహెన్నెస్ బర్గ్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా చంద్రయాన్ ` 3 ల్యాండిరగ్ పక్రియను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సగటు భారీతీయుడిలాగే తానూ పరీక్ష విజయం కోసం ఎదురుచూశానని అన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. విక్రమ్ ల్యాండర్ సుమారు 40 రోజుల పాటు ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. చంద్రయాన్`3 విజయవంత మైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జొహెన్నెస్‌బర్గ్ నుంచే దేశ ప్రజలనుద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. స్పేస్ సైన్స్ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవంపై భారత్ విజయవంతంగా తన విక్రమ్ రోవర్ ను చేర్చటంలో సఫలం కావటం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్ విజయం దేశం గర్వించే మహత్తరమైన క్షణాలుగా ప్రధాని అభివర్ణించారు. దీంతో ఇండియా ప్రపంచపటంలో కొత్త చరిత్రకు నాంది పలికిందని అన్నారు. ఇది అమృతకాలంలో నెలకొన్న తొలి ఘన విజయం ఇదని ప్రధాని మోదీ వెల్లడిరచారు. తాను దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైనప్పటికీ తన మనసంతా చంద్రయాన్`3పైనే ఉందని చెప్పారు. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం. అద్భుత విజయం కోసం 140కోట్ల మంది ఎదురు చూశారన్నారు. చంద్రయాన్`3 బృందం, ఇస్రో శాస్త్ర వేత్తలకు అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశా’నని అని మోదీ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్`3 ) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడిరది. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్ , చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటివల చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండిరగ్‌కు ప్రయత్నించిన రష్యా లూనా`25 ఈ నెల 19న జాబిల్లిపై క్రాష్ ల్యాండ్ అయింది. కానీ ఇస్రో మాత్రం అనుకున్నది సాధించింది. చందమామపై విక్రమ్ ల్యాండర్ సాప్ట్ ల్యాండిరగ్ విజయవంతమవ్వడంతో బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు ఉప్పొంగిపోయారు. వర్చువల్‌గా బెంగళూరు కేంద్రంలోని శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఉత్సాహపరిచారు. ల్యాండిరగ్ విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులపై ప్రశంజల జల్లు కురిపించారు.
ల్యాండర్ విక్రమ్ తీసిన జాబిల్లి చిత్రాలు
చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష చరిత్రలో ఇస్రో సువర్ణ ఘట్టాన్ని లిఖించిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్..కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రం తో కమ్యూనికేట్ చేసింది. బెంగళూరులోని ఈ కేంద్రానికి తాజా ఫొటోలను పంపింది. ల్యాండర్ దిగుతున్న సమయంలో హారిజాంటల్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలను ఇస్రో పోస్ట్ చేసింది.