చంద్రుడిపై నాసా వీడియో విడుదల
హూస్టన్,జూలై9(జనం సాక్షి): అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా చంద్రుడికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలాన్ని అతి దగ్గరి నుంచి చూస్తున్న అనుభూతి కలిగేలా ఈ వీడియోను రూపొందించింది. 2009 నుంచి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసా లూనార్ ఆర్బిటర్ ఈ వీడియోను తీసింది. అది కూడా 4కే రెజల్యూషన్‌లో కావడం విశేషం. 2009 నుంచి ఈ ఆర్బిటర్ సేకరించిన డేటాను ఈ వీడియోలో పొందుపరిచారు. చంద్రుడి పశ్చిమ సరిహద్దు నుంచి ఈ వీడియో మొదలువుతుంది. 2500 కిలోవిూటర్ల విస్తీర్ణంలో, 13 కిలోవిూటర్ల లోతు వరకు ఈ ఆర్బిటర్ చంద్రుడి సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఉన్న లోయలు, దాని దక్షిణ ధృవం, పీఠభూముల గురించి అధ్యయనం చేసింది. ఈ వీడియోలో అపోలో 17 లూనార్ ల్యాండర్ వదిలేసి రోవర్ వెహికిల్ కూడా కనిపిస్తుంది. ఆ అద్భుతమైన వీడియోను విూరూ ఒకసారి చూడండి.
——