చట్టపరంగా నేరస్తులకు శిక్షపడేలా చూడాలి.

ఎస్పీ రాహుల్ హెగ్డే.

సిరిసిల్ల. నవంబర్ 18. (జనం సాక్షి). దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పెండింగ్ కేసులు పై ఫంక్షనల్ వర్టికల్స్ పైన అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో ఎస్పి రాహుల్ హెగ్డే మాట్లాడుతూ మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలలో పకడ్బందీగా విచారణ జరిలాని కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కేసుల విచారాలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 17మంది అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. సమావేశంలో అదరపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్ర చారి, రవికుమార్, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, మొగిలి ,వెంకటేష్ బాన్సిలాల్ శ్రీలత, నవీన్ కుమార్ ఆర్ ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి ఎస్సైలు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.