చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు: ఎస్సై పి సంతోష్.
– నేషనల్ హైవేపై లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం…
– శాంతి భద్రతల పరిరక్షనే ధ్యేయంగా ఎస్ఐ సంతోష్…
బూర్గంపహాడ్ సెప్టెంబర్ 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో డీజే లు వినియోగం, నేషనల్ హైవే ల మీద డాన్సులు వేయడం ప్రమాదమని స్థానిక ఎస్సై పి సంతోష్ హెచ్చరించారు. డీజే లు వినియోగించ రాదని, వినాయక శోభాయాత్రను పోలీసు వారికి కమిటీ వారు తెలియజేసి తగు జాగ్రత్తలు కమిటీ వారు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని శాంతి భద్రతల పరిరక్షణకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గురువారం రాత్రి వినాయక నిమజ్జనంలో భాగంగా ఊరేగింపుతో నేషనల్ హైవే పై వెళ్తుండగా ప్రమాదశాత్తు ఓ ఇండస్ట్రీలో పనిచేసే బీహార్ కు చెందిన యువకుడు లారీ క్రింద పడడంతో తీవ్ర గాయాలయిన, అతనిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, గురువారం రాత్రి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ క్రమంలో మండలంలోని గణేష్ నిమజ్జనం కమిటీ వారికి నేషనల్ హైవే పై ఊరేగింపుగా వెళ్లకూడదని డీజేలు పెట్టి డ్యాన్స్ లు వేయకూడదని పోలీస్ శాఖ వారి ఆదేశాలున్నాయని, వీటిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై సంతోష్ తెలియజేశారు.