చదరంగలో ప్రథమ బహుమతి పొందిన టీచర్ సన్మానం

రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి);
సమైక్యతాదినోత్సవం సంధర్బంగా సిరిసిల్ల లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యములో జరిగిన జిల్లాస్థాయి ఉపాధ్యాయుల చదరంగ పోటీలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల రుద్రంగి లో తెలుగు పండిత్ గా పనిచేయుచున్న ల్యాగల స్వామి తన ప్రతిభను చూపి ప్రథమ బహుమతి పొందిన సందర్బంగా రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో సోమవారం ఘనంగా సన్మానించారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్ణబత్తుల దేవేందర్ రావు మాట్లాడుతూ… విద్యార్థులకు శారీరక ఆటలతో పాటు మెదడుకు పదునుపెట్టే చెస్ లాంటి ఆటలు కూడా ఎంతోఅవసరమని అన్నారు.320జి జిల్లాభాద్యులు లయన్ తీపిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుచు… విద్యార్థులకు చదరంగం నేర్పించవలసిన ఆవశ్యకత ఉందని,పాఠశాల నుండి ఉత్సాహం ఉన్న 40 మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగుంటుందని పాఠశాలకు 20 చదరంగ బోర్డులను లయన్స్ క్లబ్ ద్వారా ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమములో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లయన్ అంబటి శంకర్,లయన్ మంచె రమేష్,లయన్ మంచె రాజేశం,లయన్ కొమిరె శంకర్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.