చదువుల పై GST భారాలు ఎత్తివేయాలని

– ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెన్నులు,బుక్స్ పట్టుకొని నిరసన
చదువుల తల్లికే జీఎస్టీ భారమా!
కురవి జులై -22
(జనం సాక్షి న్యూస్)
కురవి మండల కేంద్రంలోని శుక్రవారం ఎస్ఎఫ్ఐ  కురవి మండల కమిటీ ఆధ్వర్యంలో బుక్లు,పెన్నులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు వాడే పెన్సీల్,ఇంకు,షార్ప్ నర్,రైటింగ్,డ్రాయింగ్, ప్రింటింగ్ మెటిరియల్,పెపర్ పల్ప్ లపై 12 శాతం
పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు,చార్ట్, మ్యాప్ పేపర్లు,గాఫ్ పేపర్లు,ఏక్సరరైజ్  నోట్ పుస్తకాలు,వర్క్ బుక్స్ పై 18 శాతం జీఎస్టీ విధించి విద్యార్ధుల చదువులు మరింత భారంగా మోపుతున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు  అన్నారు‌.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ…..పేద విద్యార్థుల చదువులపై అధిక భారాలు  మోపడం వలన చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాధం ఉందని అన్నారు.దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు ప్రవేశ పెడుతున్నారని అని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మరిపెడ డివిజన్ కార్యదర్శి జ్యోతిబసు,డివిజన్ ఉపాధ్యక్షుడు గుగులోత్ నవీన్  మండల అధ్యక్షుడు   కొలిపాక వీరెందర్,గ్రామ అధ్యక్షుడు బానోత్ కళ్యాణ్,మండల నాయకులు గంగరాజు,వీరబాబు,భిక్షపతి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area