చరిత్ర సృష్టిస్తున్న ఇస్రో 

ఆర్థిక సహకారం పెరిగితే మరిన్ని పరిశోధనలు
రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తోడ్పాటు అవసరం
శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి): అంతరిక్ష ప్రయోగాల వేదిక శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టింస్తోంది. తాజాగా చంద్రయాన్‌-2 తో భారత అంతరిక్ష కీర్తిపతాక దిగద్దాంతాలకు వ్యాప్తి చెందింది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ చేస్తున్న పరిశోధనలు దీటుగా ఉంటున్నాయి.
గతేడాది వివేకానందుడి జయంతి రోజు అపూర్వమైన విజయాన్ని ఇస్రో సొంతం చేసుకుంది.  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన మైలురాయి సాధించి, భారత ఘనతను గగనాన నిలిపింది. శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంనుంచి  వందో ఉపగ్రహాన్ని ప్రయోగించి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రెండేల్ల క్రితం  ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించిన ఘనత ఇస్రో సొంతం చేసుకున్న తరవాత, ఆ ప్రయోగంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. తరవాత వందో ఉపగ్రహాన్ని పంపి మన ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పుడు చంద్రయాన్‌-2 కూడా అంతరిక్ష పరిశోధనల్లో ఆయా దేశాలకు దీటుగా నిలిచేదే. నాసాలాంటి పరిశోధక కేంద్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇస్రో నిలిచిందనడంలో సందేహం లేదు. మన శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి సగర్వగా చాటిన మన శాస్త్రవేత్తలకు సలామ్‌ చేసే రోజు ఇది. ఇప్పటికే చంద్రయాన్‌ యాత్ర చేపట్టింది. అంగారక కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టింది. ఇలా ఎన్నో విజయాలతో దూసుకుని పోతోంది. ఈ దశలో ఇస్రో పరిశోదనలకు మరింత ఆర్థిక సహకారం ఇవ్వాల్సి ఉంది. ఈ విజయం ఒక్క రోజులో సాధ్యం కాలేదు. దీని వెనుక దశాబ్దాల తరబడి నిరంతరాయంగా సాగిన శాస్త్రవేత్తల కృషి, కఠోర పట్టుదల ఉంది. అంతరిక్ష శక్తిగా ఎదగకుండా భారత్‌ను అడ్డుకోవాలన్న అంతర్జా తీయ రాజకీయాలు ఉన్నాయి. స్వావలంబన దిశలో ఇస్రో చేస్తున్న కృషికి నూతనంగా సాధించిన ఈ సామర్థ్యం ఎంతగానో ఉపయోగపడనుంది. అన్ని ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని సాధించిన విజయం కాబట్టే ఇది చారిత్రాత్మకం. ప్రతి భారతీయుడు గర్వించదగిన సందర్భమిది.ఇంతటి ఘన విజయాన్ని దేశానికి అందించిన శాస్త్రవేత్తలకు అభినందించాల్సిందే. ఎన్నిసార్లు… ఎన్ని రోజులయినా మనవాడి తగ్గగదని రుజువు చేశారు. ఆర్యభట్టుడు చూపిన మార్గంలో మన అంతరిక్ష పరిశోధనలు మరింత గా ముందుకు సాగాలని గుర్తు చేసేలా ప్రయోగాలు సఫలం అవుతున్న తీరు మన వాసిని చాటుతున్నాయి.  భవిష్యత్‌ ఖగోళంలో ఇక భారత్‌ మాత్రమే చరిత్ర సృష్టించగలదని నిరూపించ బోతున్నారు. గతంలో పంపిన వందో ఉపగ్రహం అయిదేళ్లు పనిచేసే ఈ ఉపగ్రహంతో మన పొరుగు దేశాలపైనా నిత్యం నిఘావేసి ఉంచే సదుపాయం కలుగుతుంది. ఈ కెమెరాలు భూమిపై ఒక విూటర్‌ పరిధిని కూడా స్పష్టంగా చిత్రీకరించి త్వరితంగా ఉండే నియంత్రణ కేంద్రాలకు పంపగలవు. ఇప్పటికే అంతరిక్షంలో సేవలందిస్తున్న ‘కార్టోశాట్‌’ తరగతికి చెందిన ఉపగ్రహాలు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందివ్వడం గమనార్హం. తాజా ‘కార్టోశాట్‌’తో పట్టణ, గ్రావిూణ ప్రాంతాలకు సంబంధించి కచ్చితత్వంతో కూడిన రేఖా చిత్రాలను తయారుచేసే సౌలభ్యం లభిస్తుంది. మన దేశానికి మూడువైపులా సువిశాలమైన సముద్రతీరం ఉంది. తీరప్రాంత భూముల సమర్థ వినియోగం, జలాల
పంపిణీ, రహదారి నిర్వహణకు సంబంధించి సమగ్రమైన వ్యవస్థపై దృష్టి తదితర అంశాల్లోనూ వీటి సేవలను పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానుంది. దీంతో ఈ ప్రాజెక్టుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇవి ఉపయోగపడతాయి. గతేడాది  ఒక్క రాకెట్టుతో 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో  చరిత్ర సృష్టించడం ఒక ఎత్తయితే ఇప్పుడు నిఘా కెమెరాగా ఈప్రయోగం పనిచేయనుంది. దానిని మించి చంద్రాయాన్‌-2 సత్తా చాటింది. ఇంతకన్నా ఘనత భారత్‌కు మరోటి ఉండ బోదు. ఆర్థిక అండదండలు అందిస్తే ఇంతకన్నా అద్భుతాలు సృష్టించగలమని ఇస్రో
చాటుకుంది. ఇంత ఘనత సాధించడం వెనక మన శాస్త్రవేత్తల కృషి అమోఘం.. అనిర్వచనీయం. అపార అనుభవమూ, అత్యంత చవకైన సేవలు… ఇస్రో ప్రత్యేకత. ఇలా గతంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న ఇస్రో తాజాగా సాధించిన విజయం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ దేశాలకు ఇదో సవాల్‌గానే భావించాలి. చంద్రయాన్‌, అంగారక యాత్రలకు మనసత్తా చాటే ప్రయత్నమిది. అంతేగాకుండా అంతరిక్షంలో అనాదినుంచి మనకు ఎదురులేదని నిరూపించిన మహత్తర ఘట్టం ఇది.  ఇస్రో వరుస విజయాలను చూస్తుంటే మనం ఎవరితోనూ తీసిపోమని రుజువు చేసుకుంటున్నాం. ప్రోత్సాహం, ఆర్థిక సాయం అందించి పరిశోధనలకు ఊతమిస్తే ఎంతటి ఘనవిజయాలనైనా ఇస్రో చేసి చూపిస్తుందని నిరూపించారు మన శాస్త్రవేత్తలు. ఇస్రోకు పూర్తి సహకారం ఇస్తే రక్షణ రంగంలో కూడా గణనీయమైన పరిశోధనలు దక్కుతాయి. పొరుగుదేశం చైనా రక్షణ రంగంపై విపరీత పరిశోధనలు చేస్తూ ప్రపంచానికి సవాల్‌ విసురుతోంది. అంతరిక్ష పరిశోధనలపై చైనా భారీగా నిధులు ఖర్చుపెడుతోంది. ఇస్రో చేపడుతున్న పరిశోధనలు విజయవంతం అవుతున్న దశలో ఇస్రో సహకరాంతో రక్షణరంగ పరిశోధనలు ముమ్మరం చేయాల్సి ఉంది. ఉపగ్రహ ప్రయోగాలు వరుసగా విజయవంతం కావడం భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో నూతన అధ్యాయానికి తెర తీసింది. ఆధునిక పరిజ్ఞాన వినియోగంలోనూ సాధికారిత సాధించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ప్రపంచానికి చాటి చెప్పారు.