చర్చల వాతావరణం లేదు

3

– బుల్లెట్ల వర్షంలో ఎలా ముందుకెళ్తాం

– రాష్ట్రపతి

న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగడమే మనముందున్న ప్రధాన కర్తవ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. గతేడాది మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. గణతంత్ర దినోత్వాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఉగ్రవాదం ప్రధాన సమస్యగా మారిందని, దానిపై ఉమ్మడి పోరాటం చేయాల్సి ఉందన్నారు. దేశం కోసం అమరులైన జవాన్లకు రాష్ట్రపతి నివాళి అర్పించారు. దేశ ప్రజలకు, సరిహద్దులను కాపాడుఉతన్న వీరజవాన్లకు ఆయన రిపబ్లిక్‌ శుభాకాంక్షలు తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియా మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. అభివృద్దికి ఇది ఎంతగానో దోహదకారిగా ఉందన్నారు. ప్రపంచ ఆర్థికరంగంలో భారత్‌ దూసుకుని పోతోందన్నారు. స్లార్టప్‌ ఇండియా మేకిన్‌ ఇండియాలతో భారత్‌ దూసుకుని పోతోందన్నారు. అయితే గతేడాది ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని కూడా ప్రభావితం చేసిందన్నారు. అయినా మనం తట్టుకుని ముందుకు నడవగలుగుతున్నామని అన్నారు. దీనికి తోడు తీవ్ర దుర్భిక్షం కూడా దేశంలోని అనేక ప్రాంతాలను ప్రభావితం చేసిందన్నారు. అయితే వీటిని అధిగమించేందుకు మనం ధృడ సంకల్పంతో మందుకు సాగుతున్నామని అన్నారు.

కవాతులో ఫ్రాన్స్‌ దళాలు

భారత దేశం.. మంగళవారం.. 67వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకోనుంది. యావత్‌ భారతం దేశ భక్తితో.. శ్రద్ధాసక్తులతో.. ఈ వేడుకను నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సారి మాత్రం దేశ రాజధాని దిల్లీలోని రాజ్‌పథ్‌లో జరగబోయే పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ¬లన్‌ హాజరవుతుండగా.. మరి కొన్ని ప్రత్యేకతలు అలరిస్తున్నాయి. 1950 నుంచి ఇప్పటి వరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విదేశీ సైనికులు ఎప్పుడూ పాల్గోలేదు. తొలిసారిగా ఫ్రాన్స్‌ దళాలు మన వేడుకల్లో కవాతు నిర్వహించనున్నాయి. ఇందుకోసం జనవరి 8 నుంచి ఎనిమిది రోజుల పాటు భారత సైన్యంతోపాటు వారు కూడా రిహార్సల్స్‌లో పాల్గొన్నారు.

26 ఏళ్ల తరువాత కవాతులో ఆర్మీ శునకాలు

రాజ్‌పథ్‌లో జరిగే సైనిక కవాతులో 26 ఏళ్ల తరువాత తొలిసారిగా సైనిక శునకాలకూ ప్రవేశం లభించింది. మన సైనికులతో పాటు అంతే క్రమశిక్షణగా అవి కవాతులో పాలుపంచుకోనున్నాయి. అందుకోసం సైనికాధికారులు.. జర్మన్‌షెపర్డ్‌, లెబ్రేడర్‌ జాతులకు చెందిన 1200 శునకాల నుంచి 36 శునకాల్ని ఎంపిక చేశారు. పేలుడు పదార్థాల్ని సమర్థంగా గుర్తించడంతోపాటు ఎన్నో సందర్భాల్లో సైనికుల ప్రాణాల్ని కాపాడుతున్నందుకుగాను వాటికి ఈ సారి ఆ గౌరవం లభించింది. ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల సమయం కంటే ఈ సారి సమయాన్ని కాస్త కుదించారు. వేడుకలు చిన్నగా.. అదిరిపోయేలా ఉండాలన్న ఉద్దేశంతోనే షెడ్యుల్‌ని ఈ రకంగా తయారు చేశారు. ఎప్పుడూ 115 నిమిషాలపాటు ఈ కార్యక్రమం జరిగితే ఇప్పుడు ఆ సమయాన్ని 90 నిమిషాలు మాత్రమే జరుగుతుంది. అయితే ఫార్మెట్‌ మాత్రం అలాగే ఉంటుంది. ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచేవి.. ఆకట్టుకునేవి మన సైనికులు బైక్‌లపై చేసే విన్యాసాలు. అయితే ఈ సారి మాత్రం ఆ విన్యాసాలు చేసేది మహిళా సైనికులట. సరిహద్దు భద్రతా దళానికి చెందిన 120 మంది మహిళా సైనికులు ఆ ఫీట్లు వేసేందుకు రిహార్సల్స్‌లో నిమగ్నమయ్యారు. గతేడాది జరిగిన స్వాతంత్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిచెల్‌ ఒబామాలు హాజరయిన సంగతి తెలిసిందే. బుల్లెట్‌ ప్రూఫ్‌ వీవీఐపీ క్యాబిన్‌లో వారు కూర్చుని ఉండగా చినుకులు పడటంతో భద్రతా సిబ్బందికి వారికి గొడుగులు పట్టాల్సి వచ్చింది. ఆ అనుభవం నుంచి నేర్చిన పాఠాలతో ఇప్పుడు వీవీఐపీ ఎన్‌క్లోజర్‌కి పైన కూడా గ్లాస్‌ రూఫ్‌ని ఏర్పాటు చేస్తున్నారు.