చర్లపల్లి జైల్లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ
హైదరాబాద్, కాప్రా: చర్లపల్లి కేంద్ర కారాగారంలోని మంజీర బ్యారక్‌లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు సూపరింటెండెంట్ కేఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఇద్దరు ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లకు తరలించినట్లు చెప్పారు. వారికి క్యాంటిన్ సదుపాయం, ములాఖత్‌లను రద్దు చుసినట్లు వెల్లడించారు.