చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఎరువులు,రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ నుంచి పక్కనే ఉన్న మరో పరిశ్రమకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.