చలో జోడెఘాట్ 3వ రోజు మహాపాదయాత్ర
తాండూర్ ( జనంసాక్షి )
ఈరోజు రాష్ట్ర కమిటి తుడుందెబ్బ పిలుపులో భాగంగా చలో జోడెఘాట్ 3వ రోజు మహాపాదయాత్ర మంచిర్యాల నుండి తాండూర్ మండల్ కు జిల్లా అధ్యక్షులు మడావి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో చేరుకోవడం జరిగింది. వారికి తాండూర్ తుడుందెబ్బ నాయకులు స్వాగతం పలకడం జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సోయం జంగు జిల్లా ప్రధాన కార్యదర్శి మండిగ రవిందర్ ఉప అధ్యక్షులు కనక రాజు కాసిపేట మండల్ అధ్యక్షులు ఆత్రం జంగు కొలవార్ జిల్లా అధ్యక్షులు కమ్మరి భీమయ్య తాండూర్ మండల్ అధ్యక్షులు కుర్సింగ బాపూరావు ఉప అధ్యక్షులు అల్లకొండ బాపు ప్రధాన కార్యదర్శి యాపల సమ్మయ్య రెబ్బన రాంచందర్ యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు