చలో హెచ్‌సీయూ విజయవంతం

C

– సీఎం క్యాంపు కార్యాలయం, సెంట్రల్‌వర్సిటీలో ఉద్రిక్తత

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 6(జనంసాక్షి):విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో హెచ్‌సీయూ’ ఉద్రిక్తంగా మారింది. బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్‌సీయూ వీసీ అప్పారావును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీఎం క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు హెచ్‌సియూలోకి కూడా చొచ్చకుని పోయేందుకు విద్యార్థులు భారీగా తరలి రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇకపోతే విసిని తొలగించాలన్న పిటిషన్‌పై ఐకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏ కారణంగా తొలగిస్తారో చెప్పాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. మరోవైపు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. హెచ్‌సీయూలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి ఐకాస నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని, వీసీ అప్పారావును తొలగించాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల చలో హెచ్‌ సీయూ పిలుపు, వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్‌ వేముల మృతికి కారణమైన వీసీ అప్పారావును తొలగించాలని, రోహిత్‌ యాక్ట్‌ తీసుకురావాలనే డిమాండ్‌ తో హెచ్‌ సీయూ జాక్‌ బుధవారం చలో హెచ్‌ సీయూకి పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద భద్రత కట్టు దిట్టం చేశారు. విూడియాతో సహా..
బయటి వారిని వర్సిటీలోకి అనుమతించ లేదు. మరో వైపు యూనివర్సిటీ వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశంలో కూడా ప్రొఫెసర్లు విసిని నిలదీశారు.  వీసీ అప్పారావును వెంటనే తొలగించాలని హెచ్‌సీయూ వద్ద విద్యార్ధులు భారీగా మోహరించారు.. వీసీ గెస్ట్‌ హౌస్‌లో జరుగుతున్న అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు విద్యార్ధులను అరెస్ట్‌ చేశారు.. మరోవైపు వీసీ అప్పారావు వైఖరికి నిరసనగా హెచ్‌సీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పదవికి ప్రొ. కృష్ణ రాజీనామా చేశారు.. హెచ్‌సీయూ అకాడవిూ కౌన్సిల్‌ సమావేశంలో ప్రొ.కృష్ణ తను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు… ఇదిలా ఉంటే రోహిత్‌ వేముల మృతిపై హైకోర్టు విచారణ చేపట్టింది.  కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా వీసీ, కేంద్రమంత్రి దత్తాత్రేయను తొలగించేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా వీసీ బాధ్యుడు ఎలా అవుతారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. భావోద్వేగాల ఆధారంగా విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది.  వేముల రోహిత్‌ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా వీసీ అప్పారావును తొలగించాలన్న పిటిషనర్‌ వాదనపై  హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా వీసీ ఏవిధంగా 1 అవుతారని హైకోర్టు ప్రశ్నించింది. మనోభావాల ఆధారంగా విచారణ జరపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం వీసీనీ ఏవిధంగా తొలగించాలో చెప్పాలని తీవ్రంగా తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం వీసీని ఎలా తొలగించాలో చెప్పాలని ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా వీసీ, మంత్రులను తొలగించాలని పిటిషనర్‌ ఆరోపించారు.. ఎమోషన్స్‌ ఆధారంగా ఎలా విచారణ చేపట్టమంటారని పిటిషనర్‌ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది..ఏ నిబంధనల ప్రకారం వీసీని తొలగించాలో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.. పూర్తి అధ్యయనం చేసిన తరువాత వస్తే సోమవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి సోమవారం విచారణకు రావాలని కోర్టు సూచించింది. వీసీతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కూడా ఆయా పదవుల నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ దామోదర్‌ రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.కాగా  కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని హెచ్సీయూ విద్యార్థులు  గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అలాగే వైస్‌ ఛాన్సులర్‌ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది.  ఏ1 వీసీ అప్పారావు, ఏ2 బండారు దత్తాత్రేయ, ఏ3 సుశీల్‌ కుమార్‌, ఏ4 విష్ణుపై  సెక్షన్‌ 306 కింద  కేసు నమోదు అయ్యాయి.