చలో హైదరాబాద్ జయప్రదం చేయండి

 ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు  కృష్ణ
     కార్మికుల హక్కుల పరిరక్షణకై, ఈనెల 7న ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో జరుగు చలో హైదరాబాద్ కార్యక్రమమును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ కోరారు ఈ మేరకు వరంగల్ గవి చర్ల జంక్షన్ రోడ్లో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు
      కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల 44 కార్మిక చట్టాలను నాలుగు బార్ కోడ్ లుగా మార్చి అమలు చేయడానికి నిరసిస్తూ కార్మిక చట్టాలను రక్షించుకుంటకై  ఈనెల ఏడవ తేదీన భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద జరుగు మహాధర్నాను  విజయవంతం చేయాలని కృష్ణ అన్నారు
       కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక హక్కులను  పని భద్రతను సౌకర్యాలను హరించే కార్మిక చట్టాలను అమలులోకి తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు దేశంలోని బడా కార్పొరేట్ పెట్టుబడుదారులైన అంబానీ ఆదానీలకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరణ చేసింది అన్నారు .దీని వల్ల భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ మ్యానిటైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వలన ప్రస్తుతం పని చేస్తున్న ప్రభుత్వ రంగాలలో రిక్రూట్మెంట్ కంటే రిటైర్మెంట్ల వైపే పెట్టుబడుదారి వర్గాలు నడిపిస్తాయని భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ ఉండ బోవని ఆయన తెలిపారు. లక్షలాది కుటుంబాల ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని కొత్త పెన్షన్ విధానం రిటైర్ అయిన కార్మిక ఉద్యోగులకు అందాల్సిన సౌకర్యాలు ఉండవని ఆయన తెలిపారు .తిరిగి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
        ఈ కార్యక్రమంలో , న్యూ డెమోక్రసీ  నాయకులు రాచర్ల బాలరాజు,  మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు ,ఐ ఎఫ్ టి యు నగర ప్రధాన కార్యదర్శి బన్న నర్సింగం, నాయకులు ఎర్ర జయ బాబు ,మస్తానమ్మ, ఉసిల్ల కిరణ్    బేగం, సాంబయ్య ,బాబు  ఇనుముల కృష్ణ, హరిబాబు  బన్నీ తదితరులు పాల్గొన్నారు.