చల్లని ముచ్చట

1

అండమాన్‌కు ఋతుపవనాలు

హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : నైరుతి రుతుపవనాలు శనివారం అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయి. ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అండమాన్‌ నికోబార్‌ దీవులు, పరిసరాల్లో ప్రీమాన్‌సూన్‌ వర్షాలు కురుస్తుండడం రుతుపవనాల రాకకు అనుకూలించిందని వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ సారి తొలకరి ముందుగానే పలకరిస్తుందనే వార్తతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.