చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్ఐ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న హనుమంతప్ప అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. రామంతాపూర్ వెంకటరెడ్డి నగర్‌లోని ఆయన ఇంటి వద్ద సోమవారం తెల్లవాజామున‌‌ ఈ సంఘటన చోటు చేసుకుంది. హనుమంతప్ప ఇంటి‌ మొదటి‌ అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారు తెలిపారు.  ఆయన రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. పోలీసులు హనుమంతప్ప మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.