చింతకానిలో అబ్కారీ దాడులు
ఖమ్మం నేరవిభాగం ,చింతకాని మండలం చినమండవ, సీతంపేట గ్రామాల్లో పోలిసు, ఎక్త్సెజ్ శాఖ అధికారులు సోమవారం నాటుసారా తయారీ, విక్రమ కేంద్రాలపై దాడులు చేసినట్లు ఖమ్మం స్టేషన్ ఎక్సైజ్ ఎస్సై ఖాజాపాషా ఓ ప్రకటనలో తెలిపారు. 4 కేసులు నమోదు చేసి 70 లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకున్నామని చెప్పారు. 1700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారని తెలిపారు. చింతకాని ఎప్పై దేవేందర్, ఏఎస్సై ప్రభాకర్ అధ్వర్యంలో దాడులు జరిగాయన్నారు.