చిదంబరం కుటుంబానికి ఊరట

ఆదాయపుపన్ను శాఖ నిర్ణయాన్నిరద్దు చేసిన

చెన్నై,నవంబర్‌2(జ‌నంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం సవిూప బంధువులకు మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం ఊరటనిచ్చింది. నల్లధనం పన్ను విధింపు చట్టం, 2015 ప్రకారం చిదంబరం బంధువులపై విచారణ జరపవచ్చునని ఆదాయపు పన్ను శాఖ అధికారులు జారీ చేసిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. వీరిపై ఆదాయపు పన్ను శాఖ ఎగ్మోర్‌లోని ఆర్థిక నేరాల విభాగంలో దాఖలు చేసిన ప్రైవేటు కంప్లయింట్లను కూడా రద్దు చేసింది. చిదంబరం సతీమణి నళిని, కుమారుడు కార్తి, కోడలు శ్రీనిధి దాఖలు చేసిన అపీలుపై తీర్పును డివిజన్‌ బెంచ్‌ సెప్టెంబరు 3న వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ తమపై విచారణ జరపడాన్ని వీరు సవాల్‌ చేశారు. వీరిపై విచారణ జరిపేందుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అనుమతులు చట్టానికి అనుగుణంగా లేవని హైకోర్టు పేర్కొంది. చిదంబరం బంధువులు ముగ్గురూ విదేశీ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారని, వాటిని తమ రిటర్నులలో వెల్లడించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. కేంబ్రిడ్జ్‌లో రూ.5.37 కోట్ల విలువైన

స్థిరాస్తులను వీరు కొన్నారని పేర్కొంది. కార్తి చిదంబరం అమెరికాలోని నానో ¬ల్డింగ్స్‌లో రూ.3.28 కోట్లు, టోటస్‌ టెన్నిస్‌ లిమిటెడ్‌లో రూ.80 లక్షలు పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. వాటిని ఆదాయపు పన్ను రిటర్నులలో వెల్లడించలేదని ఆరోపించింది.