చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్: సీఎం
హైదరాబాద్, జనంసాక్షి: కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాను జారీ చేశారు. విద్యుత్ పరిస్థితిపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న తరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ వాడకంపై నిషేదాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు విద్యుత్ కోతలు తగ్గించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 15 నుంచి విద్యుత్ వాడకంపై నిషేధం ఎత్తివేయాలని, విద్యుత్ కోతులు తగ్గించాలని సూచించారు.


