చిన్నారులపై లైంగిక దాడులపై సీరియస్‌

పాఠశాల స్థాయిలోనే ప్రచార కార్యక్రమాలు

బస్తీ నుంచి బడి వరకు అవగాహన సదస్సులు

హైదరాబాద్‌,జూలై24(ఆర్‌ఎన్‌ఎ): చిన్నారులపై జరిగే లైంగికదాడులపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో చైతన్య కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇటీవల జరుగుతన్న లైంగిక దాడులతో అప్రమత్తం అమిన జిల్లా అధికార యంత్రాంగం స్కూలు స్థాయిలో విస్తృత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నది. పలురకాల చర్యలు తీసుకుంటున్న క్రమంలో పాఠశాలలన్నింటిని గర్ల్‌చైల్డ్‌ ఫ్రెండ్లీ పాఠశాలలుగా రూపుదిద్ద బోతున్నారు. పోక్సో చట్టం విూద పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌.. లైంగికదాడులు జరిగేందుకు అవకాశమున్న అంశాలను విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. పిల్లలను చైతన్యపర్చేందుకు అన్ని ఉన్నత పాఠశాలల్లో పెయింటింగ్స్‌ వేయించనున్నారు. పిల్లలపై ఉపాధ్యాయల ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. వారే చాలా అంశాలను విడమర్చి చెప్పగలరు. కనుక వారిని ఎంచుకుని బేటీ బచావో -బేటీ పడావో కార్యక్రమంపై శిక్షణ ఇవ్వబోతున్నారు. టీచర్ల సంఖ్యను బట్టి నాలుగు విడుతలుగా శిక్షణనివ్వాలని నిర్ణయించారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు పాఠశాల స్థాయిలో బాలికల రక్షణకు బాధ్యత తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేయబోతున్నారు. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామని కలెక్టర్‌ యోగితారాణా వివరించారు. బస్తీ నుంచి బడి వరకు పెద్దఎత్తున ప్రచారోద్యమాన్ని, అవగాహన సదస్సులను నిర్వహించి జిల్లాను సేఫ్‌సిటీగా మార్చబోతున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. పిల్లల పెంపకంలో అబ్బాయి-అమ్మాయి అనే తేడాలు

చూపించరాదని, దీనిపై ఇంటి నుంచే మార్పు రావాలి. మొదటగా తల్లి ఆలోచనా ధృక్పథంలో మార్పు రావాలని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. ఇంటి పనులను అమ్మాయికి మాత్రమే చెప్పరాదు. ఆహారం విషయంలో భర్త-కొడుకులకు మాత్రమే ప్రాధాన్యతనివ్వరాదు అని కలెక్టర్‌ చెప్పుకొచ్చారు. మహిళలు చేస్తున్న పనికి తగిన గుర్తింపు దక్కడంలేదు. భార్యలు ఇంట్లో, బయట నానాకష్టాలు పడి అటు వృత్తికి, ఇటు ఇంటికి ప్రాధాన్యతనిస్తున్నారని, ఆధిపత్యం ప్రదర్శించే భర్త, మగ పిల్లల ధోరణిలో మార్పురావాల్సిన అవసరముందని ఆమె చెప్పారు. బాలికలకు బంగారు భవిష్యత్‌ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని కలెక్టర్‌ డా.యోగితారాణా అభిప్రాయపడ్డారు. మొత్తంగా హైదరాబాద్‌ జిల్లాను గర్ల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ సిటీగా రూపొందించేందుకు తామంతా పని చేస్తున్నామన్నారు. దీంట్లో భాగంగా ప్రభుత్వ శాఖలన్నింటిని ఏకతాటిపైకి తీసుకొచ్చి, సమన్వయంతో ముందకెళ్తున్నామని, క్షేత్రస్థాయిలో చైతన్యం తీసుకురావడం, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా బాలికలకు రక్షణ కల్పించడం, బాలికల పట్ల పెచ్చువిూరుతున్న అఘాయిత్యాలను అరికట్టబోతున్నామన్నారు. రక్తహీనత గల బాలికలను గుర్తించేందుకు రాష్టీయ్ర బాల స్వస్థ్య కార్యక్రమం ద్వారా హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తహీనతను అధిగమించేందుకు రూ.8లక్షలతో ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌ సి మాత్రలను ఇప్పిస్తున్నారు. దీంతో పాటు పిల్లలందరికి డీ వార్మింగ్‌ మాత్రలను అందించబోతున్నాం. విటమిన్‌ సి విద్యార్థులు తీసుకున్న ఆహారాన్ని వంటబట్టిస్తున్నది. రక్తహీనత గల పిల్లలకు మూడు నెలలపాటు రెండుపూటలా ఈమాత్రలను ఇప్పిస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారంఅందించేందుకు రూ. 22 లక్షలతో రాగిలడ్డూలు పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను క్రమంగా మార్చుతున్నాం. వాటిలో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు ఉన్నాయి. వందశాతం అన్నింటిలోనూ ఏర్పాటు చేస్తాం. ఈ నెలాఖరులోగా మిగతా 21

పాఠశాలల్లోనూ రన్నింగ్‌ వాటర్‌ గల మూత్రశాలలు, మరుగుదొడ్ల వసతిని కల్పించబోతున్నాం. 182 పాఠశాలల్లో డస్ట్‌బిన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాట్లు వివరించారు.