చిన్ని ప్రయత్నంతో చేతులు దులుపుకునే యత్నం..?

ఖమ్మం, డిసెంబర్‌ 29 (: రోజు వందల కొద్ది లీటర్ల భూగర్భ జలాలను ఉపయోగించి జిల్లాలోని సత్తుపల్లి సమీపంలో బడా కంపెనీకి చెందిన మినరల్‌ వాటర్‌ ప్యాక్టరీ ప్రజల ఆరోపణల నేపధ్యంలో ఒక చిన్ని ప్రయత్నంతో చేతులు దులుపుకునేందుకు సిద్ధమైంది. దీంతో రాబోయే వేసవిలో కూడా ప్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో నీటి వ్యధలు తప్పవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విదేశి కనుసన్నల్లో నడుస్తున్న ఈ  అంతర్జాతీయ ప్యాక్టరీ నిర్వహణపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజవేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంటితుడుపుగా కొన్ని చిన్న ప్రయత్నాలు చేసి సమస్యను దాటవేయడానికి యత్నిస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల నీటి వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కథనం ఈ విధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒరిస్సా, ముంబై, కోల్‌కొత్తా వంటి రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు సైతం నీటిని ఎగుమతి చేసే ఓ బడా మినరల్‌ వాటర్‌ ప్యాక్టరీ నిర్వహణపై చాలా కాలంగా ప్రజలు గుర్రుగా ఉన్నారు. మోతాదుకు మించి భూగర్భ జలాల వాడకం జరుగుతోంది. ఈ విషయంలో ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలను తప్పించు కునేందుకు నీటి నిల్వలను పెంపొందించేందుకు కుస్తీ ప్రారంభించింది. రోజు వందలాది లీటర్ల నీటి వాడకం జరుగుతుండడంతో ప్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బోరు, బావులు అడుగంటి పోతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన భూగర్భ శాఖవారు ఆ ప్యాక్టరీ నిర్వహణపై ఇటీవల సర్వే జరిపారు. గడిచిన ఐదేళ్లలో ప్యాక్టరీ వినియోగించిన నీటి శాతాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వారిచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించిన ప్యాక్టరీ యాజమాన్యం భూగర్భ జలాలను పెంపొందించే  క్రమంలో పట్టణంలో వృధాగా పోతున్న నీటిని నిల్వ చేయాలనే ఆలోచనకు వచ్చింది. ఈ ప్రయోగాన్ని    మొదట జెవిఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. ప్రత్యేకంగా ఒక బోరు వేయించి, ఆ ప్రాంతంలో వృధాగా పోతున్న నీటిని ఇంకిపోయే విధంగా చర్యటు చేపట్టారు.