చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది

ద్వారక తిరుమల: ఎంపీ చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తప్పక ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. ఆ సమయం తొందరలోనే ఉందన్నారు. రాష్ట్రంలోని కాపు కులస్థుల ఆశ తీరుతుందని ఆయన అన్నారు. ద్వారకాతిరుమల శ్రీకృష్ణ దేవరాయ కాపు కల్యాణ మండపాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్‌, తోట నరసింహులు, పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.