చిరుత పట్టివేత
గుత్తి : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ములకల పెంట వద్ద ఈ రోజు ఉదయం గుత్తి అటవీ అధికారులు చిరుతపులిని పట్టుకున్నారు. 20 రోజుల నుంచి చిరుత గుత్తి, గుంతకల్లు మండల పరిసరాల్లో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలోఈ రోజు ఉదయం ములకల పెంట వద్ద స్థానికులు చిరుతను గుర్తించి అటవీ అధికారులను సమాచారమిచ్చారు. దీంతో వారు చిరుతను పట్టుకున్నారు.