చివరిదశకు సోయా కొనుగోళ్లు
ఆదిలాబాద్,డిసెంబర్7(జనంసాక్షి): ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ఇకపోతే ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన సోయాబీన్ కొనుగోళ్లు చివరిదశకు చేరాయి. ఇప్పటికే రెండు జిల్లాలోనూ సగానికిపైగా పత్తి పంటను ఏరేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, ఆదిలాబాద్, బోథ్, జైనథ్, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, సారంగాపూర్, కుభీర్‌లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మినుములకు సంబంధించి భైంసా, కుభీర్‌లో రెండు చోట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు పెట్టారు. 2437 టన్నుల మినుములు కొనుగోలు చేశారు. భైంసాలో మార్కెట్లో ఉన్న వాటికి మాత్రం కొనుగోలు చేస్తున్నారు.