చివరి రోజు జోరుగా ప్రచారం

గ్రామాల్లో ¬రెత్తిన నినాదాలు

బహుమతులతో ఆకట్టుకున్న ఆభ్యర్థులు

కరీంనగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చివరిరోజు అభ్యర్తులు ఉధృతంగా ప్రచారం చేపట్టారు. వివిధ గ్రామాల్లో చివరి రోజు ప్రచారం కారణంగా తమకే ఓటేయాలంటూ ముందుకు సాగారు. ని ఓ గ్రామంలో 9 మంది బరిలో నిలిచారు. ఎట్టి పరిస్థితులో సర్పంచి పీఠాన్ని గెలిచేందుకు ఎవరికి వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కలిసిన ఓటరునే అనేక మార్లు కలుస్తూ వారి మనసు గెలిచేలా ఎత్తులు పై ఎత్తులతో తమను గెలిపించాలనే విన్నపాల్ని విస్తృతంగా వినిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పంచాయతీ పోరు తుది దశకు చేరడంతో పెద్ద ఎత్తున బముమతులతో ముందుకు సాగారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల తీరు కాస్త భిన్నంగానే కనిపిస్తోంది. తొలి మలి విడత ఎన్నికలతో పోలిస్తే ఈ విడత అభ్యర్థుల ఖర్చు మరింతగా పెరుగుతోంది. పైగా అన్ని గ్రామ పంచాయతీల్లో గట్టి పోటీ కనిపిస్తోంది. ఒక్కో పంచాయతీలో ఐదారుగురు పోటీ పడుతుండటంతో పోరు రసవత్తరంగానే మారుతోంది. దీంతో ఓటర్లను ఊపిరి సలపనివ్వకుండా అభ్యర్థుల తాకిడి ప్రతి ఇంటి వద్ద పెరుగుతోంది. మూడో విడతలో కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో మొత్తంగా 43 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమవగా.. మిగతా 363 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఈ సర్పంచి స్థానాల కోసం 1556 మంది పోటీలో ఉండటంతో అన్ని ఊళ్లలో ఊహించినదానికి భిన్నంగా గట్టి పోటీ నెలకొంది. ఒక్కో గ్రామానికి సగటున ఐదుగురు పోటీలో ఉండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పని పరిస్థితి నెలకొంది. ఇక వార్డు సభ్యులకు ఇదే విధమైన ¬రా¬రీ తీరు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడో విడతలో 877 వార్డులు ఏకగ్రీవమవగా.. ఎన్నికలు జరిగే 2,905 వార్డులకుగానూ 7,902 మంది పోటీ పడుతున్నారు. తొలి, మలి విడత ఎన్నికలకు భిన్నంగా ఆఖరు విడత అభ్యర్థులు అస్త్రశస్త్రాలతో పోరుకు సిద్ధమయ్యారు. ఈనెల 30న జరగనున్న పంచాయితీ చివరి పోరులో అవసరమైన శక్తియుక్తుల్ని ఓటర్లపై ప్రయోగిస్తున్నారు. అన్ని ఊళ్లల్లో గట్టిపోటీ ఉండటం.. బరిలో ఒక్కో చోట ఐదారుగురు ఉండటంతో ఎవరికి వారే ఎత్తులు పై ఎత్తులతో దూసుకెళ్తున్నారు. తాయిలాలు, ప్రలోభాలను తారాస్థాయికి పెంచుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా పలు రకాల వస్తువుల్ని పంచు తున్నారు. వెండి కుంకుమ భరిణెలు సహా ఇతర విలువైన వస్తువులను రహస్యంగా ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఇదే తరహాలో చాలా గ్రామాల్లోనూ గెలుపు కోసం తాపత్రయపడే నాయకులు డబ్బుల్ని

విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ప్లలెలోనూ ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం సర్పంచి పదవిని అందుకోవాలనే మోజుతో ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారు. ఊహించని విధంగా ఆశావహులు ఖర్చు పెట్టారు. నిత్యం మందు, విందు కోసం లక్షలాది రూపాయల్ని వెచ్చిస్తున్నారు. ఎక్కువ ఓట్లున్న ఇళ్లకు వెళ్లి అదే పనిగా గుర్తును చూపిస్తూ ఇంటి పెద్దను ఒప్పించే పనిలో అభ్యర్థులు నిమగ్నమవుతున్నారు. ఎన్నికలకు ముందు రోజు రాత్రి మాత్రం చాలా గ్రామాల్లో డబ్బుల పంపిణీకి ఎవరికి వారుగానే రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.