చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 45 వ చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ తదితరులు హాజరయ్యారు. దీపక్‌ మిశ్రాతో రాష్ట్రపతి కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదివరకు 44 వ సీజేఐగా జస్టిస్‌ జగదీశ్‌ సింగ్‌ ఖెహర్‌ పదవీకాలం ముగియడంతో మిశ్రా తదుపరి సిజెగా ఎంపికయ్యారు. 1977 లో లాయర్‌ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మిశ్రా1996 లో ఒరిస్సా హైకోర్ట్‌ అడిషనల్‌ జడ్జ్‌ గా ఆయనను నియమించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ లో పని చేశారు. 2009 లో పాట్నా హైకోర్టు కు చీఫ్‌ జస్టిస్‌ గా పని చేశారు. 2010 లో ఢిల్లీ హైకోర్టు కు చీఫ్‌ జస్టిస్‌ గా పనిచేశారు. 2011 లో సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. మిశ్రా వెలువరించిన తీర్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. జాతీయ గీతాన్ని సినిమా థియేటర్స్‌లో ఆలపించాలని తీర్పునిచ్చింది మిశ్రాయే. అంతేకాక ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన తొలగింపు, యాకుబ్‌ మెమన్‌కు శిక్ష విధించడం, దిల్లీ గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులను శిక్షించడం, బాబ్రీ మసీదు, కావేరి జల వివాదం వంటి కీలక కేసుల్లో ఆయన తీర్పులు

వెలువరించారు. అంతేకాకుండా అధికరణ-35ఏ ను సవాలు చేసిన కేసులో, కశ్మీర్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వడం వంటి కేసులను ఆయన విచారించారు. నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీలో ఛైర్మన్‌గా సేవలందించిన ఆయన అక్కడ అనేక నూతన విధానాలను పరిచయం చేశారు. పేదలకు న్యాయ సహాయం అందించడంతో పాటు రాష్టాల్రకు లీగల్‌ అసిస్టెంట్స్‌ ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.