‘చెత్తరహిత కార్మిక క్షేత్రంగా రూపుదిద్దుదాం…’
గోదావరిఖని, జులై 25, (జనంసాక్షి) రామగుండం కార్మికక్షేత్రాన్ని చెత్తరహిత ప్రాంతం తీర్చిదిద్దుదామని… మున్సి పల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ గడ్డం మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్ ఆడిటోరియంలో చిన్న వస్త్ర వ్యాపారుల సంక్షేమం సంఘం 4వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటైన ‘చెత్తపై కొత్త సమరం…’ అనే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చెత్తను నిరోధిం చడానికి అన్నిపక్షాలు సామాజిక బాధ్యతగా ముందుకురావాలన్నారు. చెత్తను విచ్చలవిడిగా రోడ్లపై వెదజల్లకుండా…
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వడానికి ప్రజలను చైతన్య వంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే చెత్త నిల్వలు లేకుండా చేయడానికి కార్పొరేషన్ కృతనిశ్చయంతో ఉంద న్నారు. చెత్తతో అనేక ప్రయోజనాలను ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. అలాగే… పాలిథిన్ కవర్ల వినియోగాన్ని కూడా… ప్రజల నుంచి దూరం చేయడానికి కృషి జరపాలన్నారు. భవిష్యత్తులో చెత్తను నిల్వ ఉంచుకునే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం రూపొందించిన కరపత్రాన్ని కమిషనర్ ఆవిష్కరించగా, వార్షికోత్సవ కేకును అతిథులు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యులు తానిపర్తి గోపాల్‌రావు, కాంగ్రెస్ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు పి.మల్లిఖార్జున్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారి రామారావు, సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి రాజేందర్, రాయి అశోక్, నాయకులు ఓడపల్లి హరినాథ్, కుర్మ కనకయ్య, కట్ల సుధాకర్, కాటారం సారయ్య, బొమ్మినేని వెంకన్న, రాజర్ల రవీందర్, వలస సత్యం, బొద్దుల సత్యనారాయణ, సుగుణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్‌ను ఇతర నాయకులను సంఘ బాధ్యులు ఘనంగా సత్కరించారు.