చెన్నమనేని లలిత మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు భార్య, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తల్లి లలిత కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శన కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వారి నివాసంలో ఉంచారు.
చెన్నమనేని లలిత మృతికి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.