చెన్నై మెట్రో రైలు నిర్మాణంలో ప్రమాదం : ఒకరి మృతి
చెన్నై : చెన్నైలో మెట్రో రైలు నిర్మాణం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక శ్రామికుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సెయింట్ ధామన్ మౌంట్ వద్ద పిల్లర్స్ మధ్య కాంక్రీట్ ఫైల్స్ పెడుతున్న గిర్డర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి ప్రైవేటు ఆస్సత్రికి చేయిస్తున్నారు. చెన్నై మెట్రో నిర్మాణంలో ఇది రెండో ప్రమాదం గత ఆగస్టులో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.