చెన్నై రోడ్లపై అమిత్‌షా
చెన్నై,నవంబరు 21(జనంసాక్షి): కేంద్ర ¬ంమంత్రి అమిత్ షా శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ తదితరులు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి షా.. లీలా ప్యాలెస్ ¬టల్‌కు బయల్దేరారు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే అమిత్ షా తన కారును ఆపి కిందకు దిగారు. కొంతదూరం రహదారిపై కాలినడక వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపర్చారు. తనను ఆహ్వానించడానికి వచ్చిన భాజపా, అన్నాడీఎంకే మద్దతుదారులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను అమిత్ షా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘విూ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అంటూ చెన్నై ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
చెన్నై రోడ్డుపై కాలినడకన అమిత్ షా
స్వల్ప ఉద్రిక్తత..
కాగా అమిత్ షా కాలినడకన వెళ్తుండగా.. ఓ వ్యక్తి ‘గోబ్యాక్ అమిత్ షా’ ప్లకార్డు కేంద్రమంత్రిపైకి విసిరాడు. ఈ ప్లకార్డు అమిత్ షాకు 50 విూటర్ల దూరంలో పడింది. దీంతో భాజాపా కార్యకర్తలకు అతనికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తలు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేయనున్నారు. తిరువళ్లూరులో రూ. 380 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. చెన్నై మెట్రో రైలు రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై మార్గనిర్దేశనం చేయనున్నారు. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా తాజా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల అధికార అన్నాడీఎంకే, భాజపా మధ్య భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి బలోపేతంపై ఇరు పార్టీలు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది