చెప్పలేదంటనకపోయేరు
– మీరు మాట తప్పుడుతోటే మా వెయ్యి మంది బిడ్డలు సచ్చిన్రు
– రాజకీయంగా, సామాజికంగా తెలంగాణోళ్లు, సీమాంధ్రులు ఏనాడో విడిపోయిన్రు
– మంచి మాటతో ఇయ్యకుంటే మా దారి మేము చూసుకుంటం
– ఈనెల 30న ‘తెలంగాణ మార్చ్’తో మీ మెడలు వంచుతం
– ఆజాద్, షిండేకు తెగేసి చెప్పిన కోదండరాం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) :
ఈనెల 30న లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిం చాలని, లేకుంటే ఆ తరువాత జరిగే పరిణా మాలకు బాధ్యత వహించాలని ఢిల్లీ పెద్దలకు తెగేసి చెప్పినట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదం డరాం వెల్లడించారు. బుధవారం ఢిల్లీ ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. అనంతరం ఆయన మీడి యాతో ఇద్దరితో జరిగిన భేటీల అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కోదండరాం మా ట్లాడుతూ డిసెంబర్ 9న చేసిన ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవడం వల్లనే వెయ్యి మం దికి పైగా తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలకు సిద్ధపడ్డారని ఆజాద్, షిండేలకు తెలిపామన్నారు. రాజకీయంగా, సామాజికంగా తెలంగాణ, సీ మాంధ్ర ప్రజలు ఏనాడో విడిపోయారని స్పష్టంగా వివరించామన్నారు. ఈనెల 30 లోపునే తెలం గాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని, లేకుంటే అదే రోజు జరిగే తెలంగాణ మార్చ్‌తో మలి దశ ఉద్య మాన్ని ఉధృతం చేస్తామని తెలిపినట్లు కోదం డరాం వెల్లడించారు. మంచి మాటతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని, లేకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు కేంద్రమేబాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించామన్నారు. అన్ని విధాలా ఇద్దరు అగ్ర నాయకులకు తెలంగాణ ఆవశ్యక తను వివరించామని, అయినా స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కార్యా చరణ సిద్ధంగా ఉందని కోదండరాం స్పష్టం చేశా రు. తెలంగాణ మార్చ్ అంశాన్ని తమ దృష్టికి తేకుండా, కావాలని ప్రజలను రెచ్చగొట్టడానికి చేసినట్లు భవిష్యత్తులో కేంద్రం జేఏసీని ఆరోపించే అవకాశమున్నందున, చెప్పలేదని అనకుండా కేంద్రానికి చెందిన ఇద్దరు పెద్దలను కలిసి మార్చ్ విషయాన్ని తెలిపామన్నారు. ఈ సమావేశంలో కోదండరాంతోపాటు టీఎన్‌జీఓల అధ్యక్షుడు దేవీ ప్రసాద్, టీజీఓల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తదిత రులు ఉన్నారు.