చెరుకు మద్దతు ధర రూ.3500గా చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : చెరుకు పంటకు మద్దతు ధర టన్నుకు 3500 రూపాయలుగా ప్రకటించాలని, ఆ ధర ప్రకటించడంలో ప్రభుత్వాలను చక్కెరలాబీ నియంత్రిస్తుందని డాక్టర్‌ రంగరాజన్‌ సిఫార్సులు దురదృష్టకరమని ఎఐకెఎంఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి విమర్శించారు. దేశంలో 2.56 మెట్రిక్‌ టన్నుల పంచధార ఉత్పత్తి అవుతుందని, అందులో 2.20 మెట్రిక్‌టన్నుల పంచదార వినియోగమవుతుందని అన్నారు. పంచాదార ఉత్పత్తి రాష్ట్రం ఆరవస్థానంలో ఉందని, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఇచ్చే ధర కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం లేదని విమర్శించారు. భారతదేశంలో చెరుకు రైతులకు ఎలాంటి రాయితీలు ఇవ్వకపోగా ఇస్తున్న రాయితీలను కూడా క్రమేనా ఎత్తివేస్తున్నారని విమర్శించారు. చెరుకు ధర మెట్రిక్‌ టన్నుకు 3.500 ఇవ్వడంతో పాటు రవాణా చార్జీలు, కోత చార్జీలు కంపెనీలే భరించాలని డిమాండ్‌ చేశారు.