చెరువులు ఆధునీకరణ పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు అన్ని విమర్శించిన : కన్నె ప్రకాష్
ఎమ్మెల్యే, కార్పొరేటర్ ముద్దంనరసింహ యాదవ్ చెప్పేది ఒకటి, చేసేది మరొ ఒకటి
కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 08 ఓల్డ్ బోయినపల్లి హస్మత్ పేట్ చెరువు సుంద్రీకరణ గా ఆధునికరిస్తున్నట్లు కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్లు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రచారం చేస్తూ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని రాష్ట్ర బీజేవైఎం నాయకుడు కన్నె ప్రకాష్ ఆరోపించారు. సోమవారం హస్మత్ పేట చెరువు పరిసర ప్రాంతాలు పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హస్మత్ పేట్ చెరువు నీటిని ప్రక్షాళన చేస్తామని వాయు కాలుష్యం నేటి కాలుష్యం లేకుండా అందరూ పరిసర ప్రాంతాలు ఆరోగ్యంగా జీవించేలా చెరువులు ఆధునికరిస్తామని చెప్పి అందుకు భిన్నంగా నాలా లల్లో మురుగునీరు డ్రైనేజీ నీరు చెరువులో కే వదులుతూ కలుషితం చేస్తున్నారని దీనివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుదని చెరువు యధావిధిగాని కొనసాగుతుందని కోట్ల రూపాయలు నిధులు వృధా తప్ప ఇక స్థానిక ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు.చెరువు ప్రక్షాళనం పేరిట దోచుకోవడమే తప్ప మరి ఏ విధంగా ప్రజలకు ఉపయోగం లేదని ఒకవైపు వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి కాలేదని కట్టమీద నిర్మాణాల అసంపూర్తిగా ఉన్నాయని చెరువు ప్రక్షాళన పనులు ఒకటి చెప్పి మబ్బే పెట్టి అబద్ధాలు నిజాలు చేస్తున్నారు.
పాదయాత్ర పేరుతో సెలెక్ట్ చేసుకున్న రోడ్లలో తప్ప సామాన్య ప్రజలు బాధలు పట్టకుండా పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఈ పాదయాత్రలో సామాన్య ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని విమర్శించారు.ఇలా ప్రజలను మభ్యపెడితే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తీవ్ర స్థాయిలో రాబోయే రోజుల్లో కార్యచరణ చేసి ఆందోళన చేపడతామన్నారు.బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంచేస్తున్న వైఫల్యం ఎండగడతామని రాష్ట్ర బీజేవైఎం నాయకుడు కన్నె ప్రకాష్ హెచ్చరించారు.