చెరువులోకి దూసుకెళ్ళిన కారు
విజయనగరం, జూలై 30 : శృంగవరపుకోట – కొత్త వలస ప్రధాన రహదారిలో మల్లివీడు సమీపంలో రోడ్డు పక్కనున్న చెరులోకి కారు దూసుకెళ్ళింది. కిత్తన్నపేట వద్ద ఏర్పాటు చేసిన మధువాణి ఎస్టేట్‌కు చెందిన వ్యక్తులు మధ్యాహ్నం 3గంటల సమయంలో ఎపి 31 బీసీ 1008 నెంబర్ గల కారు విశాఖ వైపు వెళ్తుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో కారులో ఉన్న ఐదుగురు ఉన్నారు. ఎవరికీ ప్రమాదం జరగలేదు. కారు అదుపు తప్పి గోతిలోకి జారిపోయింది.