చైనాతో తలపడేందుకు సిద్ధం
` ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే
న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి): ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉందని, అయితే పరిస్థిత మళ్లీ ఉత్కంఠంగా మారుతాయా లేదా చెప్పలేమని, కానీ ఇప్పటి వరకు చేసినదాన్ని బట్టి చూస్తే, మనం పటిష్టంగా ఉన్నామన్నారు. యుద్ధం అనేది చివరి ఆప్షన్ అవుతుందని, ఒకవేళ ఆ యుద్ధమే జరిగినా.. దాంట్లో విజయం మనదే అవుతుందని ఆర్మీ చీఫ్ నవరవాణే తెలిపారు. చైనా రూపొందించిన కొత్త సరిహద్దు చట్టాన్ని ఆయన ఖండిరచారు. కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చిందన్నారు. ఆ చట్టం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలకు ఎటువంటి అవరోధం ఉండదన్నారు.పశ్చిమ సరిహద్దుల్లో ఉగ్రవాదులు పెరుగుతున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. వేరువేరు లాంచ్ ప్యాడ్‌ల వద్ద ఉగ్రమూకల సంఖ్య పెరుగుతోందన్నారు. దీని ద్వారా నియంత్రణ రేఖ వద్ద వరుసగా చొరబాట్లు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. గత ఏడాది జనవరి నుంచి ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో పాజిటివ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నట్లు ఆయన వెల్లడిరచారు. చైనాతో ఉన్న సరిహద్దుల్లో భారతీయ సైన్యం నిత్యం అప్రమత్తతో ఉందన్నారు. అలాగే పీఎల్‌ఏ దళాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.నాగాలాండ్‌లో డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఘటన పట్ల ఆర్మీ చీఫ్ పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన పట్ల విచారణ జరిపిస్తామన్నారు. దేశ ప్రజల భద్రత కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఏదైనా ఆపరేషన్స్ నిర్వహించిన సమయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటామని నరవాణే అన్నారు.