.చైనాను నిందించిలేం` వ్యాధి నివారణపైనే దృష్టి సారించాలి
` ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధు ఆపడంసరికాదు` బిల్‌గేట్స్ అభిప్రాయం
వాషింగ్టన్,ఏప్రిల్ 27(జనంసాక్షి): కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాు దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో మైక్రోసాప్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీక వ్యాఖ్యు చేశారు. చైనాపై ఆరోపణు చేయడానికి ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థ ప్రణాళికతో ముందుకు సాగాని సూచించారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థకునిధు నిలిపివేయడం సరైన చర్యకాదని కూడా పరోక్షంగా ట్రంప్‌కు సూచను చేశారు. వైరస్ మెగులోకి వచ్చిన తొలినాళ్లలో చైనా సరైన చర్యలే చేపట్టిందని వారికి మద్దతుగా నిలిచారు. అయితే, తదనంతరం ఎక్కడ అదుపు తప్పిందో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందని చైనాకు హితవు పలికారు. ప్రముఖ అంతర్జాతీయ విూడియా సీఎన్‌ఎన్‌కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యు చేశారు. వైరస్ మెగులోకి వచ్చిన వెంటనే కొన్ని దేశాు చాలా వేగంగా స్పందించాయని.. తద్వారా భారీ ఆర్థిక నష్టం నుంచి బయట పడ్డాయని గేట్స్ తెలిపారు. ఈ విషయంలో అమెరికా మాత్రం విఫమైందన్నారు. మానవాళిని రక్షించే శాస్త్ర సాంకేతికకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగాల్సిన తరుణమిదేనన్నారు. వేగంగా పరీక్ష నిర్వహణ, రోగుకు చికిత్స అందించడం, వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా తయారు చేయడం వంటి కీక అంశాపై దృష్టి సారించాల్సిన సమమిది అని వ్యాఖ్యానించారు. అలా కాకుండా చైనాపై ఆరోపణు చేయడం వ్ల క్ష్యం నుంచి పక్కదారి పట్టించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక డబ్ల్యూహెచ్‌ఓపై విమర్శు చేయడాన్ని కూడా బిల్‌గేట్స్ తప్పుబట్టారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో సంస్థ ఎనలేని కృషి చేస్తోందని కొనియాడారు. డబ్ల్యూహెచ్‌ఓతో అమెరికాకే మెరుగైన సంబంధాు ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్(సీడీసీ)తో కలిసి పనిచేసినంతగా.. మరే సంస్థతో డబ్ల్యూహెచ్‌ఓ పనిచేయడం లేదని తెలిపారు. నిధుల్ని నిలిపివేయడం విచారకరం.. మిలిందా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున మరో 150 మిలియన్ డార్ల విరాళాన్ని ప్రకటించారు. దీన్ని కరోనా చికిత్సల్ని అభివృద్ధి చేయడం, వ్యాక్సిన్‌పై పరిశోధను, వైద్యారోగ్య వసతుల్ని మెరుగుపరచడం వంటి పను కోసం వినియోగించనున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకురాు మిలిందా తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి డబ్ల్యూహెచ్‌ఓ ఒక్కటే సరైన వేదికని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో నిధుల్ని నిలిపివేయడం విచారకరమన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో విఫమైన అమెరికా.. చైనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణు చేస్తున్న విషయం తెలిసిందే. వైరస్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా సహా డబ్ల్యూహెచ్‌ఓ కూడా విఫమైందని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సంస్థకు ఇవ్వాల్సిన నిధును కూడా నిలిపివేశారు.