చేనేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల, నవంబర్11(జనంసాక్షి): అప్పుల బాధ తాళలేక ఓచేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్లలో శనివారం వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు బీవై నగర్‌కు చెందిన వద్నల సత్తయ్య(55) శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. కుమార్తె వివాహం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో పాటు.. మరింత కట్నం కావాలని ఆమెను పుట్టింటికి పంపేయడంతో.. మనస్తాపానికి గురైన సత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.