చేనేత కార్మికులను ప్రభుత్వ అండ

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక అక్టోబర్ 23 (జనం సాక్షి ) వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో చేనేత సహకార సంఘంలో చేనేత ఉత్పత్తులపై కేంద్ర విధించిన జిఎస్టి రద్దు చేయాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరై వివిధ సంఘాలకు పోస్ట్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు 50 ఏళ్లు నిండిన వారికి పిచన్, చేనేత కార్మికులకు బీమా వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు అలాంటి ప్రభుత్వాన్ని ఆదరించాలని వారు అన్నారు కేంద్రం జీఎస్టీ రద్దు చేసే వరకు ఉద్యమించాలని మీకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఉంటారని అన్నారు ఈ సమావేశంలో చేనేత సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సత్యనారాయణ, ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి, జెడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి, సర్పంచ్ వరలక్ష్మి స్వామి, ఎంపిటిసి సంఘ స్వరూప సమ్మయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గంగాడి తిరుపతిరెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు…….