చేనేత వస్త్రపరిశ్రమపై జీఎస్టీ భారం పడకుండా చూడాలి:డికెఅరుణ
హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్‌ను డి.కె అరుణ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మిక నాయకులు , చేనేత వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు.జీఎస్టీ భారం వేస్తే చేనేత రంగం కుదేలవుతుందని ఆమె అన్నారు. ప్రతి దశలోనూ 5 శాతం పన్ను వేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జీఎస్టీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరామని ఆమె వెల్లడించారు.