చేపల వృద్దితో ఆర్థికంగా ఎదగాలి
మత్స్యకారులకు అధికారులు సూచన
ఆదిలాబాద్,జూలై28(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లలతో మత్స్య కారులు ఆర్థికంగా ఎదగాలని మని అక్కడి నుంచి వాటిని తెప్పిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 160 చెరువుల్లో 99లక్షల చేప పిల్లలను ఈ ఎడాది విడుదల చేస్తామన్నారు. గత ఎడాది 133చెరువుల్లో 84లక్షల చేప పిల్లలను వేశామని, 1200 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. దీంతో మత్స్య కారులు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. ఈ ఏడాది అన్ని చెరువులు, కుంటలు నిండడంతో చేపలు వృద్ధి చెంది మత్స్యకారులకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.ప్రభుత్వ అదేశాల మేరకు జిల్లాకు చేప పిల్లల సరఫరాకు ఇటీవల టెండర్ నోటిఫికేషన్ వేయగా.. కైకలూరుకు చెందిన వారు టెండర్ దక్కించుకున్నారని చెప్పా రు. ఈనెల 31 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టనుందని అన్నారు. దీంతో ముందుగానే చేప పిల్లలను పరిశీలించామని చెప్పారు.