చేపల వేటకు వెళ్ళొద్దు

పలిమెల భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరగడంతో పలిమెల ఎస్సై అరుణ్ మండలంలోని గోదావరి తీర ప్రాంత గ్రామాలు అయిన సర్వాయి పేట, పలిమెల, పంకెన, మొదేడు గ్రామాలలో గ్రామస్థులను సమావేశ పరిచి వారిని హెచ్చరించడం జరిగింది. చేపలవేటకు వెళ్ళిన జాలర్లను తిప్పి పంపించారు. గ్రామస్థులు కూడా ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని, తడిగా ఉన్న గోడలు మరియు కరెంట్ పోల్స్ తాకడం లాంటివి చేయొద్దు అని వారికి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గ్రామస్థులు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కొన్న వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.