చేవెళ్ల దళిత గిరిజన డిక్లరేషన్ సభను విజయవంతం చేయండి..
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ దర్గాయి హరిప్రసాద్యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):-26వ తేదీన చేవెళ్లలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ దళిత గిరిజనులకు విజ్ఞప్తి చేశారు. సభ విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లా వద్ద నిర్వహించిన పత్రికా సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాబోవు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో దళిత గిరిజనులకు చేయనున్న మేలును, సంక్షేమ పథకాలను, దళిత గిరిజనుల భవిష్యత్తు బాగు చేయడం కోసం నిర్వహించబోయే కార్యక్రమాలను క్రోడీకరిస్తూ రూపొందించిన దళిత గిరిజన డిక్లరేషన్ ను ఆవిష్కరించడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేవెళ్ల సభను రాష్ట్రవ్యాప్తంగా దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షులు దళిత నేత శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి ఘన స్వాగతం పలకాలని పీసీసీ అధ్యక్షులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, పీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగరిగారి ప్రీతo, సి ఎల్ పి నేత శ్రీ మల్లు భట్టి విక్రమార్క, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ల పిలుపుమేరకు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అధిక సంఖ్యలో దళితులను తరలిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో పిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కొండాపురం గణేష్ , జిల్లా నాయకులు అందే నరేష్ ,భువనగిరి మండల అధ్యక్షులు ఎర్ర శ్రీరాములు, భువనగిరి పట్టణ అధ్యక్షులు కుంచo రాజు, పోచంపల్లి అధ్యక్షులు కుక్క బాలనరసింహ, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు గోపి శ్రీనివాస్, రాజపేట మండల అధ్యక్షులు ఎర్రోళ్ల బాబు, నాయకులు ఎర్ర మహేష్ ,మంద శివ, పాండాల శరత్, బుగ్గ రమేష్, తదితరులు పాల్గొన్నారు.