చైనాలో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు
బీజింగ్,జూలై26(జనంసాక్షి): చైనాలో ఉన్న అమెరికా దౌత్యకారాలయం వద్ద పేలుడు జరిగింది. బీజింగ్‌లో ఈ కార్యాలయం ఉన్నది. ఎంబసీలో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. ఎంబసీ గేటు ముందు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. దౌత్య కార్యాలయం నుంచి భారీ స్థాయిలో పొగ వస్తోంది. కార్యాలయం చుట్టు పోలీసులు వాహనాలు నిలిచిపోయాయి. అమెరికా, చైనా మధ్య ఇటీవల వాణిజ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆత్మాహుతి దాడి జరిగిందని గుర్తించారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు అన్నది ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. మరోవైపు దీనిపై అమెరికా రాయబార కార్యాలయం స్పందించలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే భారత ఎంబసీ కూడా ఉంది. బాంబు పేలుడుకు సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్ విూడియాలో పోస్టు చేస్తున్నారు.