చైనాలో భారీ అగ్నిప్రమాదం
19మంది మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు
బీజింగ్,సెప్టెంబర్30 జనంసాక్షి : చైనాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలం నుంచి ఎనిమిది మందిని పోలీసులు రక్షించారు. ఈ అగ్నిప్రమాద ఘటన జేజియాంగ్ రాష్ట్రంలోని నింఘాయ్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. నిత్యావసర సరుకులు తయారు చేసే కంపెనీలో షాట్ సర్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.