చైనా ఘర్షణలో 21 మంది మృతి

బీజింగ్‌: చైనా వాయువ్య ప్రాంతం జిన్‌ జియాంగ్‌ అధికారులు, దుండుగుల మధ్య జరిగిన భయంకరమైన  ఘర్షణలో 21 మంది మరణించారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తూన్నట్లు స్థానిక ప్రభుత్వం తెలియజేసింది. మృతుల్లో 15 మంది పోలీసులు. అధికారులు ఉన్నారు. బచు కౌంటీలోని కష్గార్‌ ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.  ఆయుదాల కోసం ఇళ్ళల్లో అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన సమాయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణలో  ఆరుగురు దుండుగులు  మృతి చెందారు.  జిన్‌జియాంగ్‌ ఇటివల సంవత్సరాల్లో చెందురు మదురుగా ఘర్షణలు జరుగుతూనే  ఉన్నాయి.  ముస్లీం యయిహుర్‌, హన్‌ చైనీస్‌ కమ్యూనిటీల మద్య జాతిపరమైన  ఉద్రిక్తతల నేపథ్యంలో  ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2009లో జరిగిన అల్లర్లలో దాదాపుగా 200 మంది వరకు హన్‌ చైనీస్‌ వర్గీయులు ప్రాణాలు కోల్పోయారు.