చైనా సరిహద్దులో ఎగిరే వస్తువులు

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లోని లఢఖ్‌ ప్రాంతంలోనూ ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ సైనిక బలగాలను మోహరించారు. గత మూడు మాసాలుగా సుమారు వంద గుర్తుతెలియని ఎగిరే పళ్లాలను కనుగొన్నారు. సైన్యం, రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ఎన్‌టిఆర్‌ఓ, ఇండోటిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీడీసీ)లు వీటిని గుర్తించడంలో విఫలమయ్యాయి. ఇవి కాంతివతంగా మెరుస్తూ కనిపించి ఆకాశంలో మాయమవుతున్నాయి. చైనా సరిహద్దులో కార్గిల్‌ లేహ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సైన్యం 14వ కోర్‌ రెజిమెంట్‌ వీటి గురించి సైనిక ప్రధానా కార్యాలయానికి నివేదికలు పంపించింది. ఐటీడీసీ యూనిట్లు వీటి ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. చైనా ప్రాంతంలో పసుపుపచ్చ వర్ణంలో గుండ్రంగా ఉన్న ఈ వస్తువులు 3-5 గంటలపాటు ఆకాశంలో విహరించి తర్వాత మాయమవుతున్నాయి. కాగా ఇవి చైనీస్‌ డ్రోమ్స్‌ కాని ఉపగ్రహాలు కాదని అధికారులు చెబుతున్నారు. వీటిని గుర్తించేందుకు సైన్యం ఇప్పటికే ఒక స్ప్రెక్ట్రమ్‌ విశ్లేషిణితో సహా రాడార్‌ యూనిట్‌ను అక్కడకు పంపించింది. కాని వారు గుర్తించలేకపోయారు. ఇవి లోహంతో చేసినవి కాకపోవడం అందుకు కారణం. ఇవి చైనా నిఘా పరికరాలని భావిస్తున్నారు. దాంతో సైనికాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. 2004లో కూడా ఇలాంటి వస్తువులను చూసినట్లు హిమాచల్‌ప్రదేశ్‌, లాహుల్‌, స్పిటి లోయలలో పర్వతారోహకులు తెలిపారు. వివిధ ఏజెన్సీలు వీటిపై దర్యాప్తు నిర్వంచాయి.

తాజావార్తలు