చౌకధరల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
పేదలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు
శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం
హైదరాబాద్,జూలై3(జనంసాక్షి): నగరంలోని మౌలాలీ కేంద్రంగా పనిచేస్తున్న శ్రీరామానుజ సేవాట్రస్ట్ చేస్తున్న మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద మధ్యతరగతి ప్రజలుగా ఉన్న వెనకబడ్డ బ్రాహ్మణులకు గృహవసతి కల్పించాలని సంకల్పించింది. ఈ సంకల్పం సిద్ధించబోతున్నది. ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ధనుంజయ్ నూతన సాంకేతికతను ఉపయోగించి, శ్రీరామానుజ మందిరం వద్ద 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని వసతులతో అతితక్కువ ధరలో చక్కటి అందమైన మోడల్ ఇల్లు, నిర్మించ బోతున్నారు.ఈమోడల్ ఇల్లు నిర్మాణ శంకుస్థాపన ఈనెల 5న గురువారం జరుపబోతున్నారు. ప్రారంభమైన ఇరవైరోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తికావడం ఈటెక్నాలజీ ప్రత్యేకత. పూర్తి నాణ్యత కల్గి మన్నికతో ఉండే ఇలాంటి మోడల్ హౌస్,దేశంలోనే పప్రధమం కావడం మరో విశేషం. అయితే ముఖ్యంగా స్వంత ఇల్లు కావాలి అని అనుకునే ,దిగువ మధ్యతరగతి వారికి ఈఇల్లు నిస్సందేహంగా ఒక వరప్రదాయిని కానుంది. ఎందుకంటే నగరానికి అతిసవిూపంలో.. ఈసంస్థ వారు గృహ సముదాయాన్ని నిర్మించడమే కాక, బ్యాంకులోను సౌకర్యం.. కల్పించి..2 లక్షలఉచిత సబ్సిడీతో మిగతా 12 లక్షలకు నెలసరి వాయిదాల ద్వారా చెల్లింపు చేసే సౌకర్యం కూడా కల్పించనున్నారు. త్వరలో నిర్మించబోయే ఈమోడల్ హౌజ్ ను శ్రీరామానుజ మందిరం వద్ద చూసి,విూ స్వంత ఇంటి కలసాకారం చేసుకోవాలని కోరుతున్నారు.