చౌటుప్పల్ లో ఎమ్మెల్యే నరేందర్ ఎన్నికల ప్రచారం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో బుధవారం రాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఆరెల్లి రవి తోపాటు స్థానిక టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.